ఏక వాడుకరి పేరు ఖరారు ప్రకటన

This page is a translated version of the page Single User Login finalisation announcement and the translation is 100% complete.
ఈ విషయపు పురోగతిపై తాజా వార్తలకు, mw:SUL finalisationని చూడండి.

మన వాడుకరులకు కొత్త మరియు మెరుగైన పనిముట్లు (క్రాస్-వికీ నోటిఫికేషన్లు వంటివి) అందించే ప్రయత్నాల్లో భాగంగా వికీమీడియా ఫౌండేషన్ డెవలపర్ల జట్టు ఖాతాలు పనిచేసే తీరులో కొన్ని మార్పులను చేస్తోంది. ఈ మార్పులకు అనుగుణంగా, వాడుకరులు అన్నిచోట్లా ఒకే ఖాతా పేరును కలిగివుండాలి. ఇది మీరు మరింత మెరుగ్గా సవరణలూ చర్చలూ చేసేలా, మరియు ఉపకరణాలు మరింత సౌలభ్యమైన వాడుకరి అనుమతులు వాడుకోగలిగేలా సౌలభ్యాలను అందించేందుకు తోడ్పడుతుంది. దీనికి ముందస్తు నిబంధన ఏమిటంటే వాడుకరి ఖాతాను ఇప్పుడు అన్ని 900 వికీమీడియా వికీలకు ఏకీకృతం చేయడం.

దురదృష్టవశాత్తూ, కొన్ని ఖాతాలు ప్రస్తుతం మా వికీలన్నింటిలోనూ ఏకీకృతంగా లేవు, పైగా అదే ఖాతాపేరు కలిగిన ఇతర వాడుకరులతో పొసగవు. ఈ వాడుకరులందరూ వికీమీడియా వికీలను భవిష్యత్తులో వాడగలిగేలా చేసేందుకు, మేము అటువంటి వివిధ ఖాతాల పేర్లను వాటి చివర "~" మరియు ఆయా ఖాతాల వికీ పేరును చేర్చి మార్చబోతున్నాం. ఈ మార్పు ఏప్రిల్ 2015లో జరుగుతుంది. ఉదాహరణకు, స్వీడిష్ విక్షనరీకి చెందిన "example" అనే పేరున్న ఖాతా ఈ మార్పు తర్వాత "example~svwiktionary"గా అవుతుంది.

అన్ని ఖాతాలూ ఎప్పటిలాగే పనిచేస్తాయి, వాటి మార్పులపై పేరూ వాటికే ఉంటుంది. కానీ, పేరు మార్చిన ఖాతాలు ఉన్న వాడుకరులు (వీరిని మేము ఒక్కొక్కరిగా సంప్రదిస్తాం), వారు ప్రవేశించేప్పుడు కొత్త ఖాతా పేరుని వాడాల్సివుంటుంది.

స్థానికంగా పేరుమార్చడం వల్ల సార్వత్రిక ఖాతాలు విడివడకుండా ఉండటానికి స్థానికంగా వాడుకరుల పేరుమార్పు సౌలభ్యం తీసివేయబడింది. కొత్త వాడుకరి పేరు నచ్చనివారు, ఆ పేరు మార్చమని వారి స్థానిక వికీలో Special:GlobalRenameRequest ద్వారా అభ్యర్థించవచ్చు లేదా ఇక్కడ మెటాలో ఖాతా పేరు మార్చమని గాని అడగవచ్చు.

ఇవి కూడా చూడండి