నిధులు సమకూర్చుట 2012 / అనువాదము /ధన్యవాదములు తెలియజేయు లేఖ

This page is a translated version of the page Fundraising 2012/Translation/Thank you letter and the translation is 84% complete.
Outdated translations are marked like this.

ప్రియమైన [given name],

వికీమీడియా ఫౌండేషన్‌కు విరాళమందించినందుకు కృతజ్ఞతలు. మీ ఔదార్యం అద్భుతం!

మా నిధుల సేకరణ విజ్ఞాపనలను పట్టించుకోకపోవడం చాలా తేలిక, కానీ మీరు అలా చేయనందుకు చాలా సంతోషం. మీవంటి ప్రజలు ఇచ్చే చందాల ద్వారానే వికీపీడియా తన ఖర్చులను భరిస్తుంది, తద్వారా మేం ఈ సైటును ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ఒక్కరికీ ఉచితంగా అందుబాటులో ఉండేలా చూడగలం.

వికీపీడియా తమకు ఉపయోగపడుతూన్నందుకూ, ఇది సంపూర్ణం కాకపోయినా, ఇది వారికోసం రాస్తునదనీ తమకు తెలుసనీ అందుకే వికీపీడియాకు విరాళమిస్తున్నామనీ ప్రజలు నాతో చెప్తారు. మరొకరి అజెండాలను, ఏదో ప్రత్యేక వాదాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని గానీ, లేదా వాస్తవం కానిదాన్ని మిమ్మల్ని నమ్మించాలకో ఉద్దేశించినది కాదు వికీపీడియా. వాస్తవాలను చెప్పడమే మా ఆశయం, అందునా దాన్ని మీవల్లనే మేం చేయగలుగుతున్నాం. ఈ సైటుకి మీరు నిధులు అందించడమే మమ్మల్ని స్వతంత్రంగానూ మరియు వికీపీడియా నుండి మీకు కావల్సినది మీరు కొరినదే మేము అందించే విధంగానూ ఉంచుతూంది. ఖచ్చితంగా ఎలా ఉండాలో అలా.

మీరు తెలుసుకోవాల్సిన విషయం: మీ విరాళం కేవలం మీ ఖర్చులకోసం మాత్రమే కాదు. సగటు దాత తన వికీపీడియా వాడుకకే కాక వందలాది ఇతరుల వాడుకకు కూడా చెల్లిస్తున్నాడు. బెంగుళూరులో తనకు తానే కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకునే ఔత్సాహిక పాపకి వికీపీడియాను మీ విరాళమే అందుబాటులో ఉంచుతుంది. అలానే వియెన్నా లోని పార్సిన్సన్ వ్యాధి ఉన్న ఓ మధ్యవయసు గృహిణికీ. 1850లలో బ్రిటైన్ గురించి పరిశోధిస్తున్న నవలికుడికీ. కార్ల్ సాగన్ గురించి ఉప్పుడే తెలుసుకున్న సాన్ సాల్వడార్ లోని ఓ పదేళ్ళ కుర్రాడికీ.

మానవ విజ్ఞానాన్నంతటినీ అందరికీ అందుబాటులో ఉంటే మా ప్రయత్నంలో చేరినందుకు, వారి తరపున, వికీపీడియాను దాని సోదర ప్రాజెక్టులను చదివే యాభై కోట్ల ప్రజల తరపున, నేను మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ విరాళం ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా చేస్తుంది. కృతజ్ఞతలు.

వికీపీడియాను నడిపించేది లాభాపేక్షలేని సంస్థ అని చాలా మందికి తెలియదు. మీ స్నేహితులను కూడా విరాళమిచ్చేలా ప్రోత్సహించడానికి ఈ ఈ-మెయిలును వారికి పంపించే అవకాశాన్ని పరిశీలించండి. ఇంకా మీకు ఆసక్తి ఉంటే, వికీపీడియాలో కొత్త సమాచారాన్ని చేర్చడానికి ప్రయత్నించండి. మీకు ఏదైనా అచ్చుతప్పు లేదా పొరపాటు కనబడితే, దయచేసి సరిచేయండి, ఉండాల్సిన విషయాలు లేకపోతే చేర్చండి.తప్పు చేస్తారేమో అని చింతించకండి: వికీపిడియాలో మార్చడం మొదలుపెట్టే వారికి అది సాధారణమే. పొరపాటు జరిగితే, మీ కోసం ఇతర వికీపీడియన్లు దాన్ని ఆనందంగా సరిదిద్దుతారు.

మీరు మాయందుంచిన విశ్వాసానికి కృతజ్ఞతలు, మీ విరాళాన్ని మేము సద్వినియోగం చేస్తామని మాట ఇస్తున్నాం.

కృతజ్ఞతలు,
సూ

సూ గార్డనర్
కార్యనిర్వహణ అధికారి,
వికీమీడియా ఫౌండేషన్ [1]

మీరు మమ్మల్ని [#twitter ట్విట్టర్], [#identica ఐడెంటికా] లేదా [#google గూగుల్+] లలో అనుసరించవచ్చు, మమ్మల్ని [#facebook ఫేస్‌బుక్‌లో] మెచ్చుకోండి మరియు [#blog మా బ్లాగును చదవండి]. [#annual వికీమీడియా ఫౌండేషన్ వార్షిక నివేదిక 2010-11], [#plan వికీమీడియా ఫౌండేషన్ వార్షిక ప్రణాళిక 2012-13] మరియు [#strategic వికీమీడియా ఫౌండేషన్ యొక్క పంచవర్ష వ్యూహత్మక ప్రణాళిక] లను చూడండి. మీరు ఇప్పుడు వికీపీడియా వస్తువులను [#shop shop.wikimedia.org] వద్ద కొనుక్కోవచ్చు.

మీ సమాచారం కోసం: [date] నాడు మీ విరాళం [amount].

[ifRecurring]

This donation is part of a recurring subscription. Monthly payments will be debited by the Wikimedia Foundation until you notify us to stop. If you’d like to cancel the payments please see our [#recurringCancel easy cancellation instructions].

[endifRecurring]

విరమించే ఎంపిక: మా దాతగా మీకు మా సామాజిక కార్యకలాపాల గురించి మరియు నిధుల సేకరణల గురించి తెలియజేస్తూంటాము. ఒక వేళ మా వద్ద నుండి అటువంటి మెయిళ్ళను అందుకోవద్దనుకుంటే, ఈ క్రింద నొక్కండి ఆ జాబితా నుండి మిమ్మల్ని తీసేస్తాం:

[#unsubscribe చందావిరమించు]

మీ విరాళానికి రశీదుగా ఈ ఉత్తరం ఉపయోగపడవచ్చు. ఈ విరాళానికి బదులుగా ఏ వస్తువులూ లేదా సేవలూ, పూర్తిగానూ లేక పాక్షికంగానూ, అందించబడలేదు. వికీమీడియా ఫౌండేషన్, ఇన్క్. అనేది లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ. దీనికి అమెరికా సంయుక్త రాష్ట్రాలలో 501(c)(3) పన్ను మినహాయింపు హోదా ఉంది. మా చిరునామా 149 న్యూ మాంట్‌గోమెరీ, 3వ అంతస్థు, సాన్‌ఫ్రాన్సిస్కో, CA, 94105. U.S. tax-exempt number: 20-0049703


Please help us to [#translate translate] this email.