Wikimedia Foundation elections/2021/Candidates/Pavan Santhosh Surampudi/te
పవన్ సంతోష్ సూరంపూడి (Pavan santhosh.s)
Pavan santhosh.s (talk • meta edits • global user summary • CA • AE)
సారాంశం వివరాలు |
| |
---|---|---|
statement (Not more than 450 words) | వైవిధ్యభరితమైన అవకాశాలూ, సంక్లిష్టమైన సమస్యలూ అల్లుకుని ఉన్న భారతదేశంలాంటి చోట సముదాయాలను నిర్మించడంలో, విధాన నిర్ణయాలు/నిర్వహణలో, భాగస్వామ్యాల రూపకల్పనలో నాకున్న విశిష్టమైన అనుభవం, లోచూపు బోర్డు సభ్యునిగా నా పనికి సాయపడతాయి.
నేను దక్షిణ భారతదేశం నుంచి వచ్చాను. 2013లో తెలుగు వికీపీడియాలో దిద్దుబాట్లు చేయడం అన్నది వికీమీడియా ఉద్యమంతో నాకున్న అనుబంధానికి ప్రారంభం అని చెప్పవచ్చు. మొదటి నుంచీ నేను కంటెంట్ అభివృద్ధి, సముదాయ అభివృద్ధి కోసం పనిచేయడం, ప్రాజెక్టులను రూపకల్పన చేసి, అమలుచేయడం, మూవ్ మెంట్ గవర్నెన్స్ వంటివాటిలో భాగస్వామిని అయ్యాను. 750+ కొత్త వ్యాసాలను సృష్టించడం, తెలుగు వికీపీడియాలోని 800 పైచిలుకు వ్యాసాలను చెప్పుకోదగ్గ స్థాయికి మెరుగుపరచడం వంటి కార్యకలాపాలతో వికీమీడియా ప్రాజెక్టులు అన్నిటిలోనూ కలిపి 49,000 దిద్దుబాట్లు చేశాను. నేను దిద్దుబాట్లు చేయడం మొదలుపెట్టిన నెలలోనే, తెలుగు వికీపీడియా దశమ వార్షికోత్సవానికి హాజరయ్యాను. ఆ కార్యక్రమం నాకు సముదాయం గురించి, సముదాయపు లక్ష్యాల గురించి మంచి అవగాహన కలగడానికి సాయంచేసింది. దాని వల్ల నేను పలు ఆన్-వికీ, ఆఫ్-వికీ కార్యక్రమాల్లో పాల్గొనసాగాను. నేను అప్పట్లో చేసిన చెప్పుకోదగ్గ ప్రాజెక్టు ఏమిటంటే డిజిటల్ లైబ్రరీ ఆఫ్ ఇండియాలో ఉన్న తెలుగు పుస్తకాలు అందరికీ అందుబాటులోకి వచ్చేలా, వాటిని వాడి కంటెంట్ సృష్టించేదుకు వీలుకలిగేలా ఆన్-వికీ క్యాటలాగ్ రూపకల్పన చేయడం. ఆ తర్వాత, నేను సెంటర్ ఫర్ ఇంటర్నెట్ అండ్ సొసైటీ - యాక్సెస్ టు నాలెడ్జ్ టీంలో తెలుగు వికీమీడియా ప్రాజెక్టులకు కమ్యూనిటీ అడ్వొకేట్‌గా చేరాను. ఇందులో నా ముఖ్యమైన బాధ్యతలు: తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల్లో కంటెంట్, నాణ్యత పెంపొందించడం, సముదాయం అభివృద్ధి చెందడానికి పనిచేయడం, కొత్త భాగస్వామ్యాలను ఏర్పరిచి నిర్వహించడం, సముదాయానికి కొత్త నైపుణ్యాలు, సామర్థ్యాలు ఏర్పరచడం. నేను ప్రారంభించిన ఒక ప్రాజెక్టు వల్ల తెలుగు వికీపీడియాలో 25,000 మొలక వ్యాసాలు కనీస స్థాయికి అభివృద్ధి చెందాయి, ట్రైన్-ద-ట్రైనర్ 2019, వికీమీడియా సమ్మిట్ ఇండియా 2019 వంటివి సహ-నిర్వహణ చేశాను. నా ఈ అనుభవంలో విద్యా సంస్థలతోనూ, ప్రభుత్వ విభాగాలతోనూ భాగస్వామ్యాలు ఏర్పరిచి నిర్వహించడం కూడా ఉంది. నేను మూవ్‌మెంట్ స్ట్రాటజీ ప్రాసెస్‌లో కమ్యూనిటీ హెల్త్ వర్కింగ్ గ్రూపులో కూడా పనిచేశాను. నేను ప్రస్తుతం Quoraలో కమ్యూనిటీ మేనేజర్‌గా ప్రపంచవ్యాప్తంగా Quora తెలుగు సముదాయాన్ని అభివృద్ధి చేయడం, నిర్వహించడం చేస్తున్నాను. Quora తెలుగు ప్రారంభం నుంచి నేను కమ్యూనిటీ మేనేజర్‌గా పనిచేస్తున్నాను. ప్రాజెక్టు ఆల్ఫా, బీటీ దశల్లోనూ, పబ్లిక్ లాంచ్ సమయంలోనూ, ఆ తర్వాత కూడా సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్‌గా వ్యవహరిస్తూ ప్రొడక్ట్, ఇంజనీరింగ్ టీంలతో సన్నిహితంగా పనిచేస్తున్నాను. ప్రాజెక్టు అభివృద్ధి కోసం భాగస్వామ్యాలపైన, మార్కెటింగ్ వ్యూహాలు అభివృద్ధి చేసి, అమలుచేయడంలోనూ కూడా పనిచేస్తాను.
ప్రపంచవ్యాప్తంగా పలు విజ్ఞాన భాండాగారాలను అందుబాటులోకి తీసుకువచ్చి, అందరి స్వంతం చేయడంలోనూ, తద్వారా లక్షలాదిమంది జీవితాలను ప్రభావితం చేయడంలోనూ వికీమీడియా ప్రాజెక్టులకు పాత్ర ఉండడం నాకు ఈ ప్రాజెక్టులపై కృషిచేయడానికి నిరంతర స్ఫూర్తి. ప్రస్తుతం పలుచోట్ల ప్రభుత్వాలూ, సామాజిక వ్యవస్థలూ నిర్లక్ష్యం వహించి, విజ్ఞానం అందుబాటు నుంచి దూరంగా పెడుతున్న ఇంకెందరో వ్యక్తుల జీవితాలపై సానుకూలమైన, సుస్థిరమైన ప్రభావాన్ని చూపగల సామర్థ్యం వికీమీడియా ఉద్యమానికి ఉంది. కానీ, ప్రస్తుతం ఉన్న వేధింపులు, వైవిధ్యం లేమి, కేంద్రీకృతమైన అధికారం, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతిక అంశాలను స్వీకరించి వాడుకోవడంలో లోపాలు - ఈ దిశగా వికీమీడియా ఉద్యమ ప్రగతి వేగాన్ని నెమ్మదింపజేస్తున్నాయి. కాబట్టి, నేను వికీమీడియా ఫౌండేషన్ బోర్డు సభ్యునిగా సేవలందిస్తూ మూవ్‌మెంట్ గవర్నెన్స్‌లో నావంతు ఈ దిశగా మెరుగుపరచాలన్నది నా బలమైన ప్రేరణ. | |
Top 3 Board priorities | 1. సీఈవో ఎంపిక, ఆన్-బోర్డింగ్: క్యాథరిన్ మెహెర్ (తాజా మాజీ-సీఈవో) చేసిన కొత్త ప్రయత్నాలు, తీసుకున్ని చర్యల నుంచి లాభం పొంది, అభివృద్ధి సాగించాలంటే సరైన వ్యక్తిని సీఈవోగా ఎంపికచేయడం చాలా ముఖ్యం. తద్వారా ఈమధ్యకాలంలో జరుగుతున్న అభివృద్ధి నుంచి అంతకుముందు కొంతకాలం సాగిన అనిశ్చితి వైపుకు ఉద్యమాన్ని తీసుకుపోకుండా ఉంటాము.
2. ఉద్యమవ్యాప్తంగా ఉన్న భాగస్వాములకు మరింత అధికారం: వికీమీడియా ఉద్యమ సంస్థలకు అధికారం కల్పించి, ప్రపంచవ్యాప్తంగా అధికార కేంద్రీకరణ తగ్గించడం అన్నది మనం కట్టుబడి ఉన్న స్ట్రాటజిక్ డైరెక్షన్‌లో ముందుకుసాగడానికి చాలా కీలకం. 3. సముదాయంతో బోర్డు సంబంధాలు మెరుగుపరచడం: సముదాయంతో కలసిపనిచేయడంలో నమ్మకాన్ని ఏర్పరుచుకోవడం, ఇది నా సంస్థ అన్న అభిప్రాయం వారికి కల్పించడం చాలా ముఖ్యం. ఉద్యమవ్యాప్తంగా సముదాయం అన్నది చాలా ముఖ్యమైన, అత్యంత కీలకమైన భాగస్వామి. నిర్ణయాలను తీసుకోవడంలో సముదాయానికి మరింత పాత్ర ఉండాలి. పలు మార్గాల్లో బోర్డు అన్నది సముదాయానికి తేలికగా అందుబాటులో ఉండాలి. | |
Top 3 Movement Strategy priorities | 1. నైపుణ్యాలు, నాయకత్వ అభివృద్ధిలో మదుపు: సమర్థంగా అమలయ్యే నైపుణ్యాలు, నాయకత్వాల అభివృద్ధి కార్యక్రమం లేకపోతే ఇప్పుడు మూవ్‌మెంట్‌లో జరుగుతున్న దానికి, రేపు జరగబోయేదానికి తేడా చాలా స్వల్పంగా ఉంటుంది. అంతేగాక, వికీమీడియా ఫౌండేషన్, ఉద్యమం వాలంటీర్ల అత్యున్నత స్వచ్ఛంద కృషి ఫలితంగా నిర్మాణమయ్యాయి కనుక ఇది వారికి తిరిగి ఇవ్వడం కిందకు రాగలదు.
2. వికీమీడియా ప్రపంచం వ్యాప్తంగా విజ్ఞాన నిధి ఏర్పాటుచేయడం: చక్కగా వ్యవస్థీకృతమైన, బహుభాషల్లో ఉండే వికీమీడియా ప్రపంచ వ్యాప్తమైన విజ్ఞాన నిధి ఏర్పాటుచేయడం అన్నది ప్రపంచవ్యాప్తంగా నాయకత్వానికి, గవర్నెన్స్‌కి సహాయకారి అవుతుంది. ప్రపంచంలోనే ప్రధాన విజ్ఞాన వనరుగా ఉన్న మనకు, సంస్థాగతంగా ఒక మంచి విజ్ఞాన నిధి లేకపోవడం ఒక లోటు. 3. యూజర్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరచడం: ప్రస్తుతం సాంకేతికంగా జరుగుతున్న అభివృద్ధిని వికీమీడియా ప్రాజెక్టులు అందుకోవాలి, అది కొత్త వాడుకరులు రావడంలోనూ, నిలబడడంలోనూ ఉన్న అనేక సమస్యలను పరిష్కరిస్తుంది. | |
Verification | Identity verification performed by Wikimedia Foundation staff and eligibility verification performed by the Elections Committee | |
Eligibility: Verified Verified by: Matanya (talk) 20:45, 1 July 2021 (UTC) |
Identification: Verified Verified by: Joe Sutherland (Wikimedia Foundation) (talk) 18:20, 29 June 2021 (UTC) |
Trustee Evaluation Form | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|