వికిమీడియా ఫౌండేషన్‌ బోర్డు ట్రస్టీలు/ఫీడ్‌బ్యాక్‌ కోసం పిలుపు: ట్రస్టీల బోర్డు ఎన్నికలు

Outdated translations are marked like this.

పరిష్కరించడానికి సమస్య

గత పది సంవత్సరాలుగా వికిమీడియా ఫౌండేషన్‌ మరియు మూవ్‌మెంట్‌ వృద్ధి చెందుతూ వచ్చాయి, మరియు బోర్డు నిర్మాణం మరియు ప్రక్రియలో దాదాపు అదే విధంగా మిగిలి ఉంది. 2019 పాలన సమీక్షలో, సామర్థ్యం, పనితీరు, మరియు మూవ్‌మెంట్‌ వైవిధ్యత యొక్క ప్రాతినిధ్య లేమి ఆందోళన కలిగించేవిగా గుర్తించబడ్డాయి.

2021లో, [[ప్రత్యేకం:నాభాష/వికిమీడియా ఫౌండేషన్‌ ట్రస్టీల బోర్డు/ఫీడ్‌బ్యాక్‌ కోసం పిలుపు: కమ్యూనిటీ బోర్డు స్థానాలు|ఫీడ్‌బ్యాక్‌ కోసం పిలుపు: కమ్యూనిటీ బోర్డు స్థానాలు]] సమయంలో ఇందులో కొన్ని సమస్యలపై చర్చించడం జరిగింది. పైన పేర్కొన్న సమస్యలను పరిష్కరించడం ప్రారంభించడానికి [[ప్రత్యేకం:నాభాష/వికిమీడియా ఫౌండేషన్‌ బోర్డు నోటీస్‌ బోర్డు/రానున్న బోర్డు ఎన్నికల గురించి 2021-04-15 తీర్మానం|2021 ట్రస్టీల బోర్డు ఎన్నికలలో తాజాగా సవరించిన ఆచరణలు చేర్చబడ్డాయి]]. బోర్డు సామర్థ్యం అవసరాలను పరిష్కరించడానికి రెండు అదనపు స్థానాలు జోడించబడ్డాయి. మూవ్‌మెంట్‌ వైవిధ్యత యొక్క ప్రాతినిథ్య అవకాశాన్ని మెరుగు పర్చడానికి ఒకసారి బదిలీ చేయగలిగే ఓటింగ్‌ ఉపయోగించబడింది. ట్రస్టీలు వారి నైపుణ్యాలను భాగస్వామ్యం చేశారు మరియు ఓటర్లకు తెలియపర్చడానికి వారివి కూడా భాగస్వామ్యం చేయమని అడిగారు. అనేక ప్రసార ఛానల్స్‌లో అనేక కమ్యూనిటీలలో అభ్యర్థులు మరియు ఓటర్లను చేరడానికి విస్తృతమైన మరియు బహుభాషల ప్రయత్నం జరిగింది.

ఫీడ్‌బ్యాక్‌ కోసం పిలుపు, 2022 సమయంలో బోర్డుపై మూవ్‌మెంట్‌ వైవిధ్యత ప్రతిఫలించడానికి అదనపు పరిష్కారాలు గుర్తించగలమని మేము ఆశిస్తున్నాము.అదనంగా, ఎన్నికల ప్రక్రియ క్రమంలో అభ్యర్థులతో సంబంధాల గురించి కమ్యూనిటీ నుంచి నేర్చుకొనే ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాము.

ఫీడ్‌బ్యాక్‌ కోసం పిలుపు ఆకృతి

ఫీడ్‌బ్యాక్‌ కోసం ఈ పిలుపుతో, 2021 ప్రక్రియ నుంచి కమ్యూనిటీ ఫీడ్‌బ్యాక్‌ను అంతర్భాగం చేసుకొనే భిన్నమైన దృక్పథాన్ని మేము చేపట్టాము. ప్రతిపాదనలతో ముందుకు వెళ్లడం బదులు, కీలకమైన ప్రశ్నల చుట్టూ ఈ పిలుపు తయారు చేయబడింది. సమష్టి సంభాషణ మరియు సహకార ప్రతిపాదన అభివృద్ధిని ప్రేరేపించడమే దీని ఉద్దేశ్యము.

ఈ ఫీడ్‌బ్యాక్‌ కోసం పిలుపులో పాల్గొనడానికి సమయం తీసుకున్నందుకు మరియు మరింత వైవిధ్యతతో మెరుగ్గా పని చేసే బోర్డు ట్రస్టీలను ఏర్పాటు చేయడంలో సహాయపడినందుకు మీకు ధన్యవాదాలు.

కీలకమైన ప్రశ్నలు

  1. ఎన్నికైన అభ్యర్థుల్లో మరింత వైవిధ్య ప్రాతినిథ్యాన్ని ఖారారు చేసుకోవడానికి ఉత్తమమైన మార్గం ఏమిటి?
  1. ఎన్నికల సమయంలో అభ్యర్థుల అంచనాలు ఏమిటి?
  1. How should affiliates participate in the elections?

కీలక ప్రశ్నల గురించి చర్చించండి

ఎలా పాల్గొనాలి

మూవ్‌మెంట్‌ వ్యూహం మరియు పాలన సిబ్బంది అనేక భాషలలో సంభాషణకు మద్దతిచ్చేలా ఉంటారు. మనకు సంక్షిప్త పరచడానికి సిబ్బంది లేని భాషలలో మనము అనువాద వాలంటీర్లపైన ఆధారపడాల్సి వచ్చినప్పటికీ, ఏ భాషలో చర్చలకైనా స్వాగతం. కీలక ప్రశ్నలను చర్చించండి పేజీలో ఉన్న పట్టికలో అనేక భాషల్లో సంభాషణలకు లింకులను మీరు కనుగొనవచ్చును. మీరు టెలిగ్రామ్‌ బోర్డు ఎంపిక ఛాట్‌పై సంభాషణను కనుగొనవచ్చును. ఫీడ్‌బ్యాక్‌ అందించడానికి లేదా కమ్యూనిటీ సంభాషణను ప్రణాళిక చేయడానికి Special:MyLanguage/Movement Strategy and Governance/About#Team మీ ప్రాంతంలోని నిర్వాహకుడిని సంప్రదించండి

కాలక్రమం

  • 23 డిసెంబర్: ఫీడ్‌బ్యాక్‌ కోసం పిలుపు ప్రకటన
  • 10 జనవరి: ఫీడ్‌బ్యాక్‌ కోసం పిలుపు ఆరంభం
  • 16 ఫిబ్రవరి: ఫీడ్‌బ్యాక్ కోసం పిలుపు ముగింపు
  • 26 ఫిబ్రవరి: ఫీడ్‌బ్యాక్‌ కోసం పిలుపు యొక్క తుది నివేదిక ప్రచురణ

ప్రతి వారం మూవ్‌మెంట్‌ వ్యూహం మరియు పాలన బృందం గత వారంలో జరిగిన చర్చలు మరియు ఫీడ్‌బ్యాక్‌ను గ్రహించడానికి Wikimedia Foundation Board of Trustees/Call for feedback: Board of Trustees elections/Reports వారంతపు నివేదిక ప్రచురిస్తుంది.

ఉపయుక్తమైన నేపథ్య సమాచారం

వందలాది అనుబంధాలు, కమ్యూనిటీల చేత ఏర్పాటైన అంతర్జాతీయ మూవ్‌మెంట్‌కు మద్ధతివ్వడానికి +450 మంది సిబ్బందితో వికిమీడియా ఫౌండేషన్ Wikimedia Foundation కోసం పాలనా సంస్థగా బోర్డు ట్రస్టీలు ఉంటారు. వికిమీడియా ఫౌండేషన్ నిర్వహణను పర్యవేక్షించడమే బోర్డు యొక్క ఏకైక పాత్రగా ఉంటుంది. ఇందులో ఇమిడి ఉన్నవి:

  • వికిమీడియా ఫౌండేషన్‌ యొక్క దీర్ఘకాలిక వ్యూహాన్ని ఏర్పాటు చేయడంలో పాల్గొనడం.
  • ఆర్థిక వ్యవహారాలు ఆరోగ్యంగా, కర్తవ్యాల కేంద్రంగా మరియు చట్టపరమైన బాధ్యతలకు అనుగుణంగా ఆర్థికత మరియు కార్యకలాపాలను పర్యవేక్షించడం.
  • వికిమీడియా సీఈఓ కోసం నియామకం,నిర్వహించడం, సలహాలు మరియు పరిహారాన్ని ఏర్పాటు చేయడం.

Board Handbookలో మరింత సమాచారం లభ్యమవుతుంది.

ఇది కూడా చూడండి