గోప్యతా విధానము/సారాంశం

This page is a translated version of the page Privacy policy/Summary and the translation is 96% complete.
Privacy Policy
Wikimedia-logo.svg
ఇది గోప్యతా విధానము యొక్క సారాంశం. అంశాలను పూర్తిగా చదివేందుకు, ఇక్కడ నొక్కండి.
నిష్పూచీ: ఈ సారాంశం, గోప్యతా విధానములో భాగం కాదు. ఇది చట్టబద్ధమైన పత్రం కాదు. పూర్తి గోప్యతా విధానాన్ని అర్థం చేసుకునేందుకు ఉపయోగపడే కరదీపిక లాంటిది మాత్రమే. మా గోప్యతా విధానానికి వాడుకరి హితమైన ఇంటరుఫేసుగా దీన్ని భావించండి.

స్వేచ్ఛా విజ్ఞాన ఉద్యమంలో పాల్గొనేందుకు మీరు మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదని మేం విశ్వసిస్తాం కాబట్టి, మీరు:

మీ కోసం వికీమీడియా సైట్లను మెరుగు పరచేందుకు గాను, వాటిని ప్రజలు ఎలా వాడుకుంటున్నారో తెలుసుకోవా లనుకుంటున్నాం కాబట్టి, మీరు కింది పనులు చేసినపుడు మేము కొంత సమాచారాన్ని సేకరిస్తాం:

మేము కిందివాటికి నిబద్ధులమై ఉన్నాం:

గుర్తుంచుకోండి:

  • ఏదైనా వికీమీడియా సైటులో మీరు చేసే మార్పుచేర్పులు బహిరంగంగా, శాశ్వతంగా ఉంటాయి.
  • మీరు లాగిన్ అవకుండా ఏదైనా వికీమీడియా సైటులో మార్పుచేర్పులు చేస్తే, అవి వాడుకరిపేరుకు కాక, అప్పటి ఐపీ చిరునామాకు ఆపాదించబడతాయి.
  • మా స్వచ్ఛంద రచయితల సముదాయం స్వీయ నియంత్రిత సంఘం. సముదాయం ఎంచుకున్న నిర్వాహకులకు, ఇటీవలి రచనల గురించిన గోప్య సమాచారం కొంత అందుబాటులో ఉంటుంది. వికీమీడియాఅ సైట్ల భద్రతకు, విధానాల అమలుకూ ఇది అవసరం.
  • ఈ గోప్యతా విధానము వికీమీడియా ఫౌండేషను నడిపే అన్ని సైట్లకు, సేవలకూ వర్తించదు. తమ స్వంత గోప్యతా విధానం కలిగినవి ఉన్నాయి (Wikimedia Shop లాంటివి) లేదా థర్డ్ పార్టీలు నడిపే సైట్లు, సేవలు (Wikimedia Labs లోని థర్డ్ పార్టీ డెవలపర్ ప్రాజెక్టులు లాంటివి).
  • ప్రపంచ వ్యాప్తంగా విద్య పట్ల, పరిశోధన పట్లా మాకున్న నిబద్ధతలో భాగంగా, అప్పుడప్పుడూ మేము సార్వజనిక సమాచారాన్ని, సంకలిత లేదా వ్యక్తిగతం కాని సమాచారాన్ని డేటా డంపులు, డేటా సెట్ల ద్వారా బహిరంగ పరుస్తూంటాం.
  • మీకు ఈ గోప్యతా విధానం ఆమోదం కాని పక్షంలో, వికీమీడియా ఫౌండేషను మరియు ఇతర వాడుకరుల భద్రత కోసం గాను, మీరు వికీమీడియా సైట్లను వాడకుంటే మంచిది.