Grants:Project/Creating Online training resources for Telugu Wikipedia/Timeline

Project Grants This project is funded by a Project Grant

proposal

timeline & progress




Timeline for Creating Online training resources for Telugu Wikipedia edit

Timeline Date
Milestone 1 Day Month Year
Milestone 2 Day Month Year
Milestone 3 Day Month Year


Monthly updates edit

Please prepare a brief project update each month, in a format of your choice, to share progress and learnings with the community along the way. Submit the link below as you complete each update.

Month 1 (July) edit

  1. ప్రాజెక్టు కమిటి సూచించిన విధంగా తెలుగు వికీపీడియాలో ఉన్న సహాయం పేజీలు, విధానాలు - మార్గదర్శకాల పేజీలను వాటి స్థాయి (సమాచారం అనువాద స్థాయి, కొత్తవారికి మార్గదర్శకం)న ఆధారంగా 100 సహాయం పేజీల జాబితాతో సహాయం పేజీల సూచిక, 78 విధానాలు - మార్గదర్శకాల పేజీల జాబితాతో విధానాలు - మార్గదర్శకాల పేజీల సూచిక పేజీని తయారు చేయడం జరిగింది.
  2. ఆయా వ్యాసాలలో సమాచారం ఎలా ఉంది, ఎంతశాతం అనువాదం అయింది, సమాచారం కొత్త వాడుకరులకు మార్గదర్శకంగా ఉందా లేదా, ఆయా పేజీల్లో చేయాల్సిన మార్పులు చేర్పులు మొదలైన వివరాలను పరిశీలించడం జరిగింది. అలాగే పేజీల సూచికల తయారీ గురించి తెలుగు వికీపీడియా రచ్చబండలో రాసి, వికీ సభ్యులు ఆయా పేజీలను చూసి తగు సూచనలు చేయాలని కోరి, వారి సూచనలు అనుసరించి సూచికల పేజీల్లో మార్పులు చేయడం జరిగింది.

Month 2 (August) edit

  1. వికీపీడియా శిక్షణ కోసం రూపొందించిన వీడియోలు (కామన్స్ లో, యూట్యూబ్ లో) చూసి, అందులోని కంటెట్, శిక్షణ విధానం, స్క్రీన్ రికార్డింగ్ పద్ధతులు, వీడియో మేకింగ్ గురించి తెలుసుకోవడం జరిగింది.
  2. వికీ రచనలో ఉన్న సందేహాలు, రచనా పద్ధతుల గురించి కొత్త వాడుకరులతో మాట్లాడి చర్చించి వారికి ఏఏ అంశాల గురించి శిక్షణ అవసరమో తెలుసుకున్నాను. తద్వారా మరింత సమాచారయుక్తంగా వికీ శిక్షణ ఉపకరణాలను తయారుచేయడం వీలవుతుంది.
  3. తెలుగు వికీపీడియాలో ఉన్న సహాయం పేజీలు, విధానాలు - మార్గదర్శకాల పేజీలలోని సమాచారం ఆధారంగా, వికీపీడియా పరిచయం – ఖాతా తెరవడం, వికీపీడియాలో వ్యాసరచన, వికీ నియమాలు అనే మూడు అంశాలను పరిగణలోకి తీసుకొని పాఠ్యాంశాలను, ప్రశ్నావళిని తయారుచేసి వికీపేజీలో పెట్టాను.

Month 3 (September) edit

  1. ఆగస్టు నెలలో తయారుచేసిన పాఠ్యాంశాలను, ప్రశ్నావళిని సముదాయ సభ్యుల మరియు ప్రాజెక్టు కమిటీ సూచనలమేరకు వర్గం(బోధన, శిక్షణ)- స్థాయి (ప్రాథమిక, మధ్యమ, ఉన్నత) - స్థితి (కంటెంట్, వీడియో తయారీ, ప్రయోగం) అనే మూడు భాగాలతో ఒక టేబుల్ ఫార్మాట్ రూపొందించాను.
  2. వికీపీడియా పరిచయం, వికీ యూజర్ ఇంటర్ ఫేజ్ పరిచయం, వికీపీడియా వ్యాస వివరాల పరిచయం, ఇన్ పుట్ టూల్స్ పరిచయం, వికీ ఖాతాను తెరవడం మొదలైన పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రశ్నలతో వీడియోలకు కావలసిన కంటెంట్ ను తయారుచేశాను.

Month 4 edit

  1. దాదాపు 8 టాపిక్ లకు సంబంధించి పాఠాలను రాయడం జరిగింది. చదువుకొని, వికీలో దిద్దబాట్లు చేయడానికి ఆయా పాఠాలు వీలుగా ఉన్నాయి. వాటిని వీడియోలుగా తయారుచేయడానికి ఒక్కో వీడియోకు స్టోరి బోర్డను కూడా తయారుచేశాం.
  2. వికీపీడియా శిక్షణకు సంబంధించి 8 పాఠాలతో 1. వికీపీడియా పరిచయం, 2. యూజర్ ఇంటర్ ఫేజ్ పరిచయం, 3. వ్యాస వివరాల పరిచయం, 4. ఖాతాను తెరవడం, 5. వాడుకరి పేజీని సృష్టి, 6. వాడుకరి చర్చాపేజీ, 7. ప్రయోగశాల, 8. వీక్షణ జాబితా పేజీలు సృష్టించడం తయారుచేసి, సముదాయ సభ్యులు ఈ పేజీలను పరిశీలించి తమ సలహాలు, సూచనలు, మార్పులు తెలియజేయాలని రచ్చబండలో కోరాము. (తెలుగు వికీపీడియా పాఠాల జాబితా)

Month 5 edit

  1. గత నెలలో తయారుచేసిన 8 పాఠాలకు సంబంధించి ఒక మహిళా వాయిస్ ఓవర్ ఆర్టిస్టుతో వాయిస్ రికార్డు చేశాము.
  2. ఆ వాయిస్ ను అనుసరించి, వీడియోల తయారీకి కావలసిన వీడియోలను స్క్రీన్ రికార్డింగ్ చేశాను.

Month 6 edit

  1. పాఠ్య ప్రణాళిక రూపకల్పనలో భాగంగా పాఠాల వీడియోల ప్రారంభంలో ఉపయోగించాల్సిన లోగో, ఇంట్రో వీడియోల మోడల్ డిజైన్ చేశాము. లోగో, వీడియో విషయమై ప్రాజెక్టు కమిటీతో, ఇతర వికీసభ్యులతో చర్చించగా, సలహాలు, సూచనలు అందించారు. వారి సూచనలను అనుసరించి వాటిని రీ-డిజైన్ చేస్తున్నాము. (Logo, Intro Video Models on Google Drive)
  2. తయారుచేసిన పాఠ్యాంశాలను, ప్రశ్నావళిని సముదాయ సభ్యుల, ప్రాజెక్టు కమిటీ సూచనలమేరకు వర్గం(బోధన, శిక్షణ)- స్థాయి (ప్రాథమిక, మధ్యమ, ఉన్నత) - స్థితి (కంటెంట్, వీడియో తయారీ, ప్రయోగం) అనే మూడు భాగాలతో ఒక టేబుల్ ఫార్మాట్ తయారీ. (Topic Table on Google Drive)
  3. వికీపీడియా పరిచయం, వికీ యూజర్ ఇంటర్ ఫేజ్ పరిచయం, వికీపీడియా వ్యాస వివరాల పరిచయం, ఇన్ పుట్ టూల్స్ పరిచయం, వికీ ఖాతాను తెరవడం, వాడుకరి చర్చాపేజీ, ప్రయోగశాల, వీక్షణ జాబితా మొదలైన పాఠ్యాంశాలకు సంబంధించిన ప్రశ్నలతో వీడియోలకు కావలసిన కంటెంట్ తయారుచేశాము. (Content for Video Making on Google Drive) and (On Telugu Wikipedia)
  4. ఫిమేల్ వాయిస్ ఓవర్ కోసం కొంతమంది వాయిస్ ఓవర్లను పరిశీలించి, ఒక వాయిస్ ను సెలక్ట్ చేశాము. వాయిస్ ఓవర్ ఆర్టిస్టుతో కొన్ని టాపిక్స్ వాయిస్ ఓవర్ రికార్డు చేయించాము. (Voice Over Models on Google Drive)
  5. రాసుకున్న పాఠాలలో, డెమో పరిశీలన కోసం 3 పాఠాలకు సంబంధించిన వీడియోలను స్క్రీన్ రికార్డింగ్ చేశాను. (Screen Recording Videos on Google Drive)

Committee Discussion edit

2022 అక్టోబరు 22న ఉదయం 10 గంటలకు కమిటీ సభ్యులతో జరిగిన గూగుల్ మీట్ సమావేశంలో వికీలో ప్రస్తుతమున్న "వెక్టర్" స్థానంలో "వెక్టర్ 2022" డిఫాల్టు రూపుగా రాబోతోందని ప్రాజెక్టు కమిటీ సభ్యుల సమావేశంలో ప్రస్తావించగా... ఇప్పటివరకు చేసినవాటిని వదిలిపెట్టి, వాటి స్థానంలో కొత్త రూపుకు తగ్గట్టుగానే పాఠాలు రూపొందించుకుంటేనే బాగుంటుందని ప్రాజెక్టు కమిటీ సభ్యులు సూచించారు. దాంతో వాటని మళ్ళీ కొత్తగా రూపొందించాల్సివస్తుంది. అయితే, వెక్టర్ 2022 రూపు ఇంకా పరిశీలన దశలోనే ఉండడంతో రూపులో మార్పులు జరుగుతున్నాయి.

Activities

  1. ప్రాజెక్టు కమిటీ సభ్యుల సూచనల మేరకు "వెక్టర్ 2022"ను వాడుతూ దిద్దుబాట్లు చేయడంతోపాటు కొత్త వ్యాసాలను రాస్తున్నాను.
  2. గతంలో రాసిన టాపిక్స్ లల్లో 1. వికీపీడియా పరిచయం, 2. మొదటిపేజీ పరిచయం, 3. యూజర్ ఇంటర్ ఫేజ్ పరిచయం, 4. వ్యాస వివరాల పరిచయం, 5. ఖాతాను తెరవడం, 6. వాడుకరి పేజీని సృష్టి, 7. వాడుకరి చర్చాపేజీ, 8. ప్రయోగశాల, 9. వీక్షణ జాబితా పాఠాన్ని పరిశీలించి, కొత్తరూపుకు తగినట్టుగా చేయాల్సిన మార్పులను లిస్టు చేశాను.
  3. రాసిన టాపిక్స్ ను మరోసారి రివిజన్ చేశాను.

Is your final report due but you need more time?



Extension request 1 edit

New end date edit

31 October 2023

Rationale edit

I have completed half of the work on my project. However, the project committee members have suggested that we switch to the new format called 'Vector 2022' instead of the previous 'Vector.' They recommend leaving the work done so far and creating lessons based on the new format. This is because Vector 2022 is going to be the default format in place of the current Vector.

Investing additional time in modifying our project to align with 'Vector 2022' may initially appear as a temporary setback. However, in the long term, this transition will result in significant cost savings. Since these training videos are intended for use in training events and future projects, it is crucial for them to be in sync with the new default 'Vector' format. By doing so, we can ensure the creation of impactful videos that will remain useful going forward. --Pranayraj1985 (talk)

This extension request has been approved. --DSaroyan (WMF) (talk) 12:10, 3 July 2023 (UTC)
Noting here the new grant related dates -- new grant end date is 30 October 2023 and new grant report due date is 30 November 2023. -- JTud (WMF), Grants Administrator (talk) 22:31, 5 July 2023 (UTC)
Thankyou. --Pranayraj1985 (talk)

Extension request 2 edit

New end date edit

30 January 2024

Rationale edit

In the part of my Creating Online Training Resources for Telugu Wikipedia project, the community members gave some suggestions regarding making videos as part of the project. Following those instructions, the content of the videos and video clips had to be changed. So, some more time is needed to complete the project. I will complete the project by January 15, 2024, and submit the final report by January 30.

However, I would like to inform you earlier (before 30th November). Due to the illness of some of our family members, we had to stay in the hospital for the last month. So I could not convey this suggestion to you in time.

Please excuse me and allow me to extend the new grant end date is January 15, 2024, and the final report is due on January 30, 2024.--Pranayraj1985 (talk) 17:21, 20 December 2023 (UTC)